న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతలు కార్లోస్ అల్కారజ్, ఇగా స్వియాటెక్ టాప్ ర్యాంక్‌లు సొంతం చేసుకున్నారు. 1973లో ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న పిన్న వయసు ప్లేయర్‌గా అల్కారజ్ రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో టైటిల్‌తో పాటు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. యూఎస్ ఓపెన్‌కు ముందు నాలుగో ర్యాంక్‌లో ఉన్న అల్కారజ్ అగ్రస్థానానికి చేరుకోగా, రూడ్ ఏడో ర్యాంక్ నుంచి రెండులో నిలిచాడు. నాదల్ మూడో ర్యాంక్‌లో ఉండగా, టాప్ ర్యాంక్ నుంచి మెద్వదెవ్ నాలుగుకు పడిపోయాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్(5), సిట్సిపాస్(6), నోవాక్ జొకోవిచ్(7) ఆ తర్వాత ర్యాంక్‌ల్లో ఉన్నారు. మహిళల విభాగంలో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ నంబర్‌వన్ ర్యాంక్ కైవసం చేసుకోగా, రన్నరప్ జాబర్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. కొంటావిట్(3), జెస్సికా పెగ్యులా(5), కోకో గాఫ్(8) తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు.