CEC Rajiv Kumar | ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్‌కుమార్ తెలిపారు. ఎక్కడ కోడ్ ఉల్లంఘన జరిగినా ఫొటో/వీడియో తీసి యాప్‌లో అప్లోడ్ చేసి ఘటన వివరాలు తెలిపితే 100 నిమిషాల్లో (1గంట 40 నిమిషాలు) జీఐఎస్ లోకేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ స్పందస్తుందని చెప్పారు.
ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యాప్‌తోపాటు ఓటర్ హెల్ప్‌లైన్, సువిధ పోర్టల్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను ‘నో యువర్ క్యాండిడేట్’ యాప్‌లో తెలుసుకోవచ్చని అన్నారు. అభ్యర్థుల నేర చరిత్రపై పార్టీలు, అభ్యర్థి కూడా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.