సైకిల్ ఫర్ చేంజ్ విజేత వరంగల్

- దేశవ్యాప్తంగా 11 నగరాల ఎంపిక
- కేంద్రం నుంచి అవార్డు.. కోటి నజరానా
- జీడబ్ల్యూఎంసీకి మంత్రి కేటీఆర్ ప్రశంసలు
వరంగల్, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో వరంగల్ నగరం విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 11నగరాలకు ఈ టైటిల్ దక్కగా వాటిలో తెలంగాణ నుంచి వరంగల్ ఒక్కటే నిలిచి గెలిచింది. అన్నివర్గాలవారిని ‘సైక్లింగ్’లో ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసి కేంద్రం నుంచి అవార్డుతోపాటు కోటి రూపాయల నజరానా అందుకునేలా చేసిన ‘జీడబ్ల్యూఎంసీ’పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. పోటీలో విజయం సాధించేందుకు పాటుపడ్డ ‘స్మార్ట్ సిటీ’ బృందానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 107 నగరాలు పోటీ పడ్డాయి. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి నిర్వహణ తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 11 నగరాలను గుర్తించింది. ప్రాథమిక దశలో ఎంపికైన 25 నగరాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఉండగా, తుది పోటీకి ఎంపికైన 11 నగరాల్లో ఒక్క వరంగల్ మాత్రమే నిలిచింది. విజేతలను అంతర్జాతీయ రవాణా నిపుణులతో కూడిన న్యాయ నిర్ణేతల కమిటీ ఎంపిక చేసింది. వరంగల్ నగరంలో అన్ని వర్గాల ప్రజలను సైకిల్ తొక్కేందుకు ప్రోత్సహించిన తీరు, కల్పించిన వసతులు, ప్రత్యేకంగా వేసిన సైకిల్ ట్రాక్, పార్కు, ప్రచార అంశాలను కమిటీ పరిశీలించి ఎంపికచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

