సింహాల గుర్తింపునకు హైదరాబాద్ సాఫ్ట్వేర్
గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ఉండే విభిన్నమైన ఆషియాటిక్ సింహాలను గుర్తించేందుకు హైదరాబాద్‌కు చెందిన టెలియోల్యాబ్స్ కమ్యూనికేషన్స్ సంస్థ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ (సాఫ్ట్వేర్ విత్ ఇంటెలిజెంట్ మార్కింగ్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్-సింబ)ను అభివృద్ధి చేసింది
అభివృద్ధి చేసిన టెలియోల్యాబ్స్
హైదరాబాద్, మార్చి 14: గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ఉండే విభిన్నమైన ఆషియాటిక్ సింహాలను గుర్తించేందుకు హైదరాబాద్‌కు చెందిన టెలియోల్యాబ్స్ కమ్యూనికేషన్స్ సంస్థ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ (సాఫ్ట్వేర్ విత్ ఇంటెలిజెంట్ మార్కింగ్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్-సింబ)ను అభివృద్ధి చేసింది. అంతరించిపోతున్న ఏషియాటిక్ సింహాలను పరిరక్షించుకునేందుకు ఈ సాఫ్ట్వేర్ దోహదపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. ‘వన్యప్రాణులను గుర్తించేందుకు సాధారణంగా శరీరభాగాల ఆకారాలు, మచ్చలను ఆధారం చేసుకుంటారు. ఏషియాటిక్ సింహాలన్నీ చూడడానికి ఒకేవిధంగా ఉంటాయి. వీటిని గుర్తించడం కష్టమవుతుంది. వాటి మూతిపై ఉండే వెంట్రుకలు, మచ్చల్లోని అత్యంత సూక్ష్మంగా ఉండే తేడాలను ఈ సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. సింహాలకు ఆధార్ తరహాలో నంబర్లను కేటాయిస్తుంది. డాటాను కూడా తయారు చేస్తుంది. ఫలితంగా సింహాల జనాభాను గుర్తించి వాటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది’ అని అమిత్‌సింగ్ వివరించారు. గిర్ అభయారణ్యం అధికారులు ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

