హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో(Aswaraopet) భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. బొలేరో వాహనంలో తరలిస్తున్న 3.30 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం(Seizure) చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.