Vemulawada | శ్రావణ సోమవారం.. వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్నది.
వేములవాడ: శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు తమ వంతు కోసం క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజల సేవలను అధికారులు రద్దు చేశారు. శ్రావణ సోమవారం కావడంతో స్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
భక్తులు పుట్టు వెంట్రుకలు సమర్పించి అభిషేకాలు జరిపించుకుని, కుంకుమార్చన నిర్వహించుకుని, శివకళ్యాణం, చంఢీయాగం, పల్లకిసేవ, పెద్ద సేవ లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ నేలలో అన్ని సోమవారాల్లో శివుడికి ప్రత్యే రుద్రాభిషేకాలు, మహా లింగార్చన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

