CM KCR | అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3000 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి.. సీఎం కేసీఆర్
CM KCR | ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గృహ లక్ష్మి పథకం కింద మూడు వేల మందిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు.
CM KCR | జూన్ రెండో తేదీ నుంచి మూడు వారాలు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కే చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గృహ లక్ష్మి పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గానికి 3000 చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇంటి నిర్మాణంలో ఆయా దశలను ఫోటోలు తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు దశలవారీగా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సొంత జాగాలు ఉన్న లబ్ధిదారులకు మొదటి దశ అనగా బేస్ మెంట్ దశలో రూ.లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ.3 లక్షలు అంద జేయాలని సీఎం తెలిపారు.
ఇందుకు సంబంధించిన నిర్థిష్ట విధి విధానాలను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్దతిలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సిఎం తెలిపారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

