Bandi Bhageerath | మిస్టరీ.. బండి భగీరథ్ లొంగిపోయాడా? పోలీసులే అరెస్టు చేశారా?
Bandi Bhageerath | పొక్సో కేసులో నిందితునిగా ఉండి, తొమ్మిది రోజులపాటు పరారీలో ఉన్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి చేరుకున్నాడు. అయితే భగీరథ్ స్వయంగా లొంగిపోయాడా లేక పోలీసులు అరెస్టు చేశారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
Bandi Bhageerath | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): పొక్సో కేసులో నిందితునిగా ఉండి, తొమ్మిది రోజులపాటు పరారీలో ఉన్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి చేరుకున్నాడు. అయితే భగీరథ్ స్వయంగా లొంగిపోయాడా లేక పోలీసులు అరెస్టు చేశారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. చట్టాలపై ఉన్న గౌరవంతో తానే స్వయంగా తన కుమారుడిని ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పచెప్పినట్టు భగీరథ్ తండ్రి బండి సంజయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మరో పక్క నార్సింగిలోని అప్పా జంక్షన్ వద్ద తమ సిబ్బంది భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్ వెల్లడించడం అయోమయానికి గురిచేసింది. బాలికపై లైంగికదాడి కేసులో పోక్సో చట్టాలను ఎదుర్కొంటున్న భగీరథ్ ఈనెల 13న పోలీసు విచారణకు హాజరుకాకపోవడంతో మొదలైన హైడ్రామా రోజుకో కొత్త మలుపు తిరిగింది.
పోలీసుల విచారణకు హాజరుకాని భగీరథ్ తనకు రెండు రోజుల సమయం కోరుతూ పోలీసులకు మెయిల్ పంపడం, అంతలోనే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, మరోవైపు బాధితురాలు మైనరే కాదు అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు తొలి రోజు నుంచే పూర్తి అయోమయంగా మారింది. తీరా బాధితురాలు మైనరేనని నిర్ధారించిన పోలీసులు విషయాన్ని కోర్టుకు విన్నవించడంతో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.
దీంతో సైబరాబాద్ పోలీసులు శనివారం భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీచేయడంతో పాటు బంజారాహిల్స్, కరీంనగర్‌లోని అతడి నివాసాలలో సోదాలు చేయడంతో ఇక అరెస్టు తప్పదనే వాదనలు వినిపించాయి. ఇంతలో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్‌తోపాటు మేడ్చల్ కోర్టు, స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసు బలగాలను మోహరించడంతో నిందితుడు లొంగిపోతున్నట్టు అందరూ భావించారు.
పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ….
మధ్యాహ్నమే నిందితుడు పోలీసులకు లొంగిపోయాడని కొందరు, లేదు అంతకన్నా ముందే పోలీసుల అదుపులో ఉన్నట్టు మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. నిందితుడిని ఉదయమే అదుపులోకి తీసుకున్నప్పటికీ పగటివేళ అరెస్టు చూపిస్తే మహిళా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి నిరసనసెగ తప్పదని భావించిన పోలీసులు పొద్దుపోయాక విషయాన్ని బయటకు లీక్ చేశారనే వాదనలు కూడా వినిపించాయి. పోక్సోలో నిందితునిగా ఉన్న తన కుమారుడిని ఇంతకాలం దాచిపెట్టాడన్న అపవాదు నుంచి బయటపడటానికే బండి సంజయ్ తానే అప్పగించినట్టు ప్రకటన విడుదల చేశారని కొందరు భావిస్తుండగా.. నిందితుడు లొంగిపోయాడని అంగీకరిస్తే.. ఇంతకాలం అతడిని అరెస్టు చేయలేకపోయిన తమ అసమర్థతపై విమర్శలు వస్తాయన్న భావనతోనే పోలీసులు తామే అరెస్టు చేశామని ప్రకటించారన్న వాదన మరో వైపు వినిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్.. కొడుకు కోసం రాంప్రసాద్ తల్లి స్పెషల్ టీ, సుధీర్ తల్లి కన్నీళ్లు!
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

