సన్నరకం ధాన్యానికి భారీ డిమాండ్
సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే ఆలస్యం మిల్లర్లు, వ్యాపారులు పొలంలోకే వెళ్లి ధాన్యం కొంటున్నారు.
- క్వింటాలుకు రూ.2500 వరకు ధర
- మద్దతు ధర కన్నా రూ.400 అధికం
- పోటీపడి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు
- ఇతర రాష్ర్టాల్లో తగ్గడంతో డిమాండ్
- సన్నబియ్యం ధరలపైనా ప్రభావం
హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే ఆలస్యం మిల్లర్లు, వ్యాపారులు పొలంలోకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. కొందరైతే రైతులకు ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. దేశంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోటమే దీనికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు.
ఈ సీజన్లో దేశవ్యాప్తంగా వరిసాగు భారీగా తగ్గింది. అదే సమయంలో ఒక్క తెలంగాణలో మాత్రమే వరి సాగు పెరగటం గమనార్హం. ప్రస్తుతం వరికి మద్దతు ధర క్వింటాలుకు రూ.2060 ఉన్నది. ఈ లెక్కన రైతులకు మద్దతు ధరకు మించి సుమారు రూ.400-500 వరకు దక్కుతున్నది. ధాన్యం కొనుగోలు సమయంలో 17 శాతం వరకు తేమను అనుమతిస్తారు. కానీ 27-30 శాతం తేమ ఉన్నా, వ్యాపారులు భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా మిల్లర్లు పచ్చి ధాన్యమే కొంటుడటంతో తూకం పెరిగి.. రైతులకు మద్దతు ధరకు అదనంగా మరో రూ.100-200 వరకు గిట్టుబాటవుతున్నది.
యాసంగిలో రికార్డు ధర
సాధారణంగా సన్నాలకు వానకాలంలో భారీ ధర పలుకుతుంది. ఆ సీజన్లో ఎక్కువగా సన్నాలు సాగు చేస్తారు. దీంతో పాటు ధాన్యం కూడా నాణ్యత ఎక్కువగా ఉంటది. దీంతో క్వింటాలు రూ.2,500 వరకు ధర పలుకుతుంది. యాసంగిలో ఆస్థాయిలో ధర ఉండదు. కానీ ఈ సీజన్లో మాత్రం వానకాలాన్ని మించి సన్నాలకు ధర పలుకుతుండటంపై వ్యాపారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో ఈస్థాయి ధర ఎప్పుడూ లేదని చెప్తున్నారు.
తగ్గిన పంట.. పెరిగిన డిమాండ్
యాసంగిలో పలు రాష్ర్టాల్లో వరిసాగులో తగ్గుదల నమోదైంది. మరీ ముఖ్యంగా సన్నాలసాగు మరింత తగ్గింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం యాసంగిలో వరిసాగు పెరిగింది. ఈ యాసంగి సీజన్లో వరిసాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర వ్యాపారులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వ్యాపారులు కూడా తెలంగాణకు వచ్చి ధాన్యం కొనుగోలుకు పోటీ పడుతుండటం గమనార్హం.
బియ్యం ధరలపైనా ప్రభావం
సన్నధాన్యం ధర పెరుగుదల ప్రభావం బియ్యం ధరపై పడే అవకాశం ఉన్నదని వ్యాపారులు తెలిపారు. కిలోపై రూ.5కు పైగా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. వ్యాపారులకు గిట్టుబాటు కావాలంటే ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

