మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఊరట
సికింద్రాబాద్లోని బోయిగూడలో 1,936 చదరపు గజాల స్థలం విషయమై మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్టీఫెన్సన్కు చెందిన ఆ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 134 అమలుపై హైకోర్టు బుధవారం స్టే విధించింది.
- జీవో 134 అమలుపై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని బోయిగూడలో 1,936 చదరపు గజాల స్థలం విషయమై మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్టీఫెన్సన్కు చెందిన ఆ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 134 అమలుపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. అంతకుముందు స్టీఫెన్సన్ తరఫున డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిటిషనర్ ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు.
ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, వారి అనుచరులు, బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకునే రేవంత్రెడ్డి సర్కార్ ఈ చర్యలకు దిగిందని, సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో తాను ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం.. జీవో 134 అమలును నిలిపివేసింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం స్టీఫెన్సన్ ఆస్తికి మాత్రమే వర్తిస్తాయని, సదరు జీవో పరిధిలోని ఇతర ఆస్తులకు వర్తించబోవని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

