అటవీకరణ పనులపై నివేదిక ఇవ్వండి
వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన అటవీ భూములకు ప్రతిగా చేపట్టిన అటవీకరణ పనుల పురోగతిపై పూర్తి వివరాలతో అదనపు నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు కోసం 2,900 ఎకరాల అటవీ భూములను కేటాయించడాన్ని సవాలు చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 2 ( నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన అటవీ భూములకు ప్రతిగా చేపట్టిన అటవీకరణ పనుల పురోగతిపై పూర్తి వివరాలతో అదనపు నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు కోసం 2,900 ఎకరాల అటవీ భూములను కేటాయించడాన్ని సవాలు చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత రెండేండ్లలో నాటిన 9.16 లక్షల మొకల్లో 8.23 లక్షల మొక్కలు బతికాయని తెలిపారు. ఎండిపోయిన మొకల స్థానంలో 92 వేల కొత్త మొకలను వచ్చే వర్షాకాలంలో నాటనున్నట్టు చెప్పారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. చనిపోయిన మొకల స్థానంలో కొత్తవి నాటి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

