పరిహారాన్ని 72 ఎఫ్డీలు చేస్తారా?
రైల్వే ప్రమాద పరిహారంగా మంజూరైన రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను రూ.10 వేల చొప్పున 72 ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేయాలన్న రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టు ఇటీవల సవరించింది.
- రూ.7.20 లక్షలను 4 ఎఫ్‌డీలుగా చేయాలని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రమాద పరిహారంగా మంజూరైన రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను రూ.10 వేల చొప్పున 72 ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేయాలన్న రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టు ఇటీవల సవరించింది. అలా నెలకు రూ.10 వేల చొప్పున 72 నెలలపాటు డిపాజిట్లు చేయడం వల్ల పిటిషనర్‌కు కలిగే ప్రయోజనం ఏమిటో రైల్వే శాఖ తరఫు న్యాయవాది వివరించలేకపోయారని, పరిహార మొత్తాన్ని ఇన్ని డిపాజిట్లుగా విభజించడం సహేతుకం కాదని పేరొన్నది.
ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పిటిషనర్‌కు చెల్లించిన రూ.80 వేలతోపాటు అప్పటివరకు వచ్చిన వడ్డీని కూడా చెల్లించాలని, మిగిలిన రూ.7.20 లక్షలను రూ.1.80 లక్షల చొప్పున నాలుగు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. వాటిపై సమ్మిళిత వడ్డీ కొనసాగించాలని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన తేదీ నుంచి పరిహారం మొత్తం జమయ్యే వరకు ఏడాదికి 9% వడ్డీ చెల్లించాలని ట్రిబ్యునల్ గతంలో నిర్ణయించింది.
పిటిషనర్ తన కుమార్తె విద్య, వివాహం లేదా ఇతర అవసరాల కోసం పరిహారంలో కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని తెలిపింది. అటువంటి దరఖాస్తును చట్టప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్‌ను హైకోర్టు ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

