హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
హైదరాబాద్‌లో భారీ వర్షం | రాష్ర్ట రాజధాని హైదరాబాద్ మహానగరంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది

హైదరాబాద్ : రాష్ర్ట రాజధాని హైదరాబాద్ మహానగరంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం సమయంలో వాతావరణం కాస్త చల్లబడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, సంతోష్ నగర్, కోఠి, మెహిదీపట్నం, టోలిచౌకీ, లక్డికాపూల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, మియాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, వర్షం కురియడంతో నగర ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- Rains
- Weather Dept
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

