TS Weather Alert | వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే పది రోజులు ఎండలే..
TS Weather Alert | హైదరాబాద్, అక్టోబర్ 6 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
TS Weather Alert | హైదరాబాద్, అక్టోబర్ 6 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి కారణంగా రాష్ట్రంలో వచ్చే పది రోజులు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉదయం, రాత్రి సమయాల్లో 19 – 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. అదే పగటి పూట 33-36 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించారు. ఇక నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కాగా.. దీని ప్రభావంతో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 9 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. దాదాపు రెండు వారాలు ఆలస్యంగా రుతుపవనాలు రాష్ర్టాన్ని తాకాయి. జూన్ మొదటి వారంలో కురవాల్సిన వర్షాలు .. జూన్ 20 తర్వాత అడపాదడపా కురిశాయి. ఆ తర్వాత జులై చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లాలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ వరుణుడు ముఖం చాటేశాడు. సెప్టెంబర్ నెలలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఇక ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో చెదురుమొదురుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

