Nagarjuna | మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున (Nagarjuna) పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.
హైదరాబాద్: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున (Nagarjuna) పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరుగనుంది.
మంత్రి సురేఖ మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, పత్రికల్లో ప్రధానంగా వచ్చాయని నాగార్జున తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కథనాల క్లిప్పింగులను కోర్టుకు సమర్పించారు. మంత్రి వ్యాఖ్యలతో తాను షాక్‌కు గురయ్యానని, అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని పిటిషన్లో వివరించారు. కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, కన్వెన్షన్‌హాల్ కూల్చడానికి, మంత్రి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు.
కన్వెన్షన్ సెంటర్ తనకు (నాగార్జున) చెందినదని, నాగచైతన్య-సమంత విడాకులకు లింక్ లేదని, కేటీఆర్‌పై నిందారోపణలు చేసి అక్కినేని కుటుంబానికి ఉన్న పరువుకు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జాతీయ చానళ్లు కూడా మంత్రి మీడియా సమావేశాన్ని ప్రసారం చేశాయని తెలిపారు. బిగ్బాగ్ హోస్ట్‌గా, సినిమా హీరోగా, నిర్మాతగా తనకు, తమ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలను పాడుచేసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, కావాలని ఆమె తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని, కేసు నమోదు చేసి వాస్తవాలను వెలికి తీయాలని కోర్టును కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

