మెరిట్ లిస్ట్.. మరో టెస్ట్!
స్టాఫ్ నర్సుల నియామకాలకు ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన మెరిట్ జాబితా తీవ్ర గందరగోళానికి తెరలేపింది. 9 విభాగాల్లో 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి వైద్యారోగ్య శాఖ గత నెల 28వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో జనవరి 30న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది.
- 1,419 పేజీలతో స్టాఫ్‌నర్స్ మెరిట్ జాబితా
- జోన్ల వారీగా జాబితా లేక తీవ్ర అయోమయం
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 9,892 మంది ఎంపిక
- అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన
స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితా 1,419 పేజీలు! సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 200 పేజీలతో 9,892 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇందులో హాల్‌టికెట్ తప్ప మరే వివరాలూ లేవు. ఒక అభ్యర్థి తన జోన్లో, తన రిజర్వేషన్ క్యాటగిరీలో ఎన్ని మార్కులవారిని పిలిచారో తెలుసుకోవాలంటే 1,419 పేజీల మెరిట్ జాబితాలోని 9,892 హాల్ టికెట్ నంబర్లను వెతుక్కొని చెక్ చేసుకోవాల్సిందే. ఇది ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. జోన్లు, రిజర్వేషన్ వారీగా ఎన్ని మార్కులు వచ్చినవారిని వెరిఫికేషన్‌కు పిలిచారన్న జాబితాను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): స్టాఫ్ నర్సుల నియామకాలకు ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన మెరిట్ జాబితా తీవ్ర గందరగోళానికి తెరలేపింది. 9 విభాగాల్లో 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి వైద్యారోగ్య శాఖ గత నెల 28వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో జనవరి 30న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. ఈ పోస్టులకు సుమారు 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారందరి మార్కులతో మెరిట్ జాబితాను విడుదల చేశారు. మార్కుల ఆధారంగా విడుదలైన ఈ జాబితా ఏకంగా 1,419 పేజీలు ఉన్నది. ఇందులో తమ పేరును వెతుక్కోవడంతోపాటు ఆ జోన్ పరిధిలో ఏ క్యాటగిరీ వారికి అత్యధికంగా ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలను తెలుసుకోవడం అభ్యర్థులకు సాధ్యం కాలేదు.
వెరిఫికేషన్ ఎలా సాధ్యం?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 9,892 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ఇది 200 పేజీలు ఉన్నది. ఇందులో కేవలం అభ్యర్థి అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ మాత్రమే నమోదు చేశారు. జోన్లవారీగా ఫలితాలు ఇవ్వలేదు. కనీసం అభ్యర్థుల హాల్‌టికెట్‌తోపాటు జోన్, రిజర్వేషన్ క్యాటగిరీ లాంటి వివరాలేమీ లేవు. దీంతో ఒక్కో హాల్‌టికెట్ నంబర్‌ను 1,419 పేజీల మెరిట్ లిస్ట్‌లోని వివరాలతో చెక్ చేసుకోవాల్సి వచ్చింది. తమకన్నా తక్కువ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేశారంటూ కొందరు అభ్యర్థులు ఇటీవల డీఎంఈ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. మరికొందరు స్టాఫ్ నర్స్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా జోన్లు, రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా మెరిట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాలను విడుదల చేసి తమ అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు.
52 మార్కులు వచ్చినా..
మాది 5వ జోన్. స్టాఫ్ నర్స్ పరీక్షలో 52 మార్కులు సాధించిన నాకు జనరల్ లేదా ఎస్టీ క్యాటగిరీలో కచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లిస్ట్‌లో నా పేరు లేదు. 9 వేల మంది హాల్‌టికెట్ల వివరాలు క్రాస్ చెక్ చేయడం నాకే కాదు ఎవరికైనా అసాధ్యమే. ఇవన్నీ చూస్తుంటే జాబితాలో అవకతవకలు జరిగాయన్న అనుమానం కలుగుతున్నది.
– బానోతు నిర్మల, సూర్యాపేట జిల్లా
సెలక్షన్ లిస్ట్ మాత్రమే జోన్లు, క్యాటగిరీల వారీగా ఇస్తాం
ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఎంహెచ్ఎస్ఆర్బీ అధికారులను కోరగా.. ఉద్యోగాలకు ఎంపికైన తుది అభ్యర్థుల జాబితాను మాత్రమే జోన్లు, క్యాటగిరీల వారీగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అందులో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఎక్సైజ్ అకాడమీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతున్న కేంద్రానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

