రాష్ట్రంలో మరో 6 కొవిడ్ దవాఖానల లైసెన్సు రద్దు
కొవిడ్ దవాఖానల లైసెన్సు రద్దు | రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు దవాఖానల లైసెన్సులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ హైదరాబాద్ నగర పరిధిలోవే.

హైదరాబాద్ : కొవిడ్ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝుళిపిస్తున్నది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వైద్యశాలల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నది. తాజాగా రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు దవాఖానల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిమ్స్ (సికింద్రాబాద్) , సన్‌షైన్ (గచ్చిబౌలి), సెంచరీ (బంజారాహిల్స్), లోటస్ ( లక్డీకాపూల్ ), మెడిసిన్ (ఎల్బీనగర్), ఇంటెగ్రో (టోలీచౌకి) దవాఖానలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 22 కొవిడ్ దవాఖానల లైనెన్స్‌లు రద్దయ్యాయి. 113 దవాఖానలకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కొత్తగా 8 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

