రక్షణశాఖ భూములను అప్పగించండి
రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సహకరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్‌కు విజ్ఞప్తి చేశారు.
- ఏవోసీ పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మిస్తాం : సీఎస్
- కేంద్ర రక్షణశాఖ కార్యదర్శికి వినతి
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సహకరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ గురువారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులను కలిసి రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను విన్నవించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రక్షణ భూముల సమస్యలపై చర్చించారు.
సికింద్రాబాద్ ఏవోసీ రోడ్ల మూసివేతకు బదులుగా ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి రక్షణశాఖ భూమిని అప్పగించాలని, మెహిదీపట్నంలో సైవాక్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు, లింక్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణకు రక్షణశాఖ భూముల కేటాయింపు తదితర అంశాలను కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపు సమస్యలు పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేశ్ కే సింగ్‌కు విన్నవించారు. రాష్ట్రంలో వరి ధాన్యం ఆరబోసేందుకు ఉపాధి హామీ పథకం నిధులతో కల్లాలు నిర్మిస్తున్నట్టు సీఎస్ ఆయనకు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

