Hailstorm | హైదరాబాద్‌లో వడగండ్ల వాన ..వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Hailstorm | హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ , పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ ( Hyderabad ) , పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల ( Hailstorm) వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
సికింద్రాబాద్ బోయిన్ పల్లి పరిసర ప్రాంతాలలో వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది.
కూకట్పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన కురిసింది. వేడి వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివానతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని, వచ్చే కొన్ని గంటలు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చింతల్, పద్మనగర్‌లో గాలి వాన ధాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు దాటికి రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారులపైకి వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ భారీవర్షమే పడింది. కొన్నాళ్లుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు స్వాంతన పొందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

