అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి
అనారోగ్యం బారినపడి గురుకుల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. జుక్కల్ మండలం పడంపల్లికి చెందిన అంజలి (12) ఏడో తరగతి చదువుతున్నది. ఇటీవల ఇంటికి వెళ్లిన బాలిక.. గత నెల 27న పాఠశాలకు వచ్చింది. గురువారం జ్వరంతోపాటు వాంతులు చేసుకున్నది.
బాన్సువాడ, ఆగస్టు 31: అనారోగ్యం బారినపడి గురుకుల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. జుక్కల్ మండలం పడంపల్లికి చెందిన అంజలి (12) ఏడో తరగతి చదువుతున్నది. ఇటీవల ఇంటికి వెళ్లిన బాలిక.. గత నెల 27న పాఠశాలకు వచ్చింది. గురువారం జ్వరంతోపాటు వాంతులు చేసుకున్నది. శుక్రవారం మరోసారి వాంతులు చేసుకోగా టీచర్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అంజలి మృతి చెందింది. ఘటనపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విచారణ చేపట్టారు.
చదువుకోవాలంటే.. ఇలా ప్రయాణించాల్సిందే!
పాఠశాలకు వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులు ప్రాణాలకు తెగించాల్సిందే! జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పచ్చర్లకు చెందిన విద్యార్థులు మాన్‌దొడ్డి పాఠశాలకు నిత్యం ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నారు. మాన్‌దొడ్డి గ్రామంలోని ఇంటర్ విద్యార్థులు అయిజలో విద్యనభ్యసిస్తున్నారు. నిత్యం ఆటోల్లో కిక్కిరిసి.. టాప్‌లపై కూర్చొని ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామాలకు బస్సులు నడపడం లేదని, దారిలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను వాపోతున్నారు.
-రాజోళి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

