Uma Harathi | ప్రతి ఓటమినీ గెలుపుగా మార్చుకున్నా.. పట్టుబట్టి ఐఏఎస్ సాధించా.. సివిల్స్ 3వ ర్యాంకర్ ఎన్ ఉమాహారతి
Uma Harathi | తన లక్ష్యం సివిల్.. నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైనా.. కలత చెందకుండా ధైర్యంతో ముందడుగువేసి ఐదోసారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ఎన్ ఉమాహారతి మెరుగైన ర్యాంక్ సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి ఆల్ ఇండియాస్థాయిలో మూడో ర్యాంక్ సాధించి అందరితో శభాష్ అనిపించుకొన్నారు
Uma Harathi | నారాయణపేట: తన లక్ష్యం సివిల్.. నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైనా.. కలత చెందకుండా ధైర్యంతో ముందడుగువేసి ఐదోసారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ఎన్ ఉమాహారతి మెరుగైన ర్యాంక్ సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి ఆల్ ఇండియాస్థాయిలో మూడో ర్యాంక్ సాధించి అందరితో శభాష్ అనిపించుకొన్నారు. ప్రతి ఓటమినీ గెలుపునకు నాందిగా మార్చుకొని విజయం సాధించినట్టు ఉమాహారతి చెప్పారు. ఉమాహారతికి ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీస్ అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పేరు : ఎన్ ఉమాహారతి
తల్లి : ఎన్ శ్రీదేవి
తండ్రి : ఎన్ వెంకటేశ్వర్లు (ఐపీఏస్), ప్రస్తుతం నారాయణపేట ఎస్పీ
తమ్ముడు : ఎన్ సాయివికాస్ (ఐఈఎస్), ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం
సొంత ఊరు : హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా
విద్యాభ్యాసం: 6 నుంచి 10వ తరగతి-భారతీయ విద్యాభవన్, హైదరాబాద్
ఇంటర్మీడియట్- నారాయణ కాలేజ్, హైదరాబాద్ , ఐఐటీ, బీటెక్ సివిల్ ఇంజినీర్-హైదరాబాద్
ప్రతిరోజూ ఎన్ని గంటలు చదివేవారు?
ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివేదాన్ని. చదివినంతసేపు ఎంతో శ్రద్ధపెట్టేదాన్ని.
మీకు స్ఫూర్తి ఎవరు?
అమ్మ-నాన్న, తమ్ముడు. ముఖ్యంగా నాన్న. ప్రజలకు సేవ చేయడానికి ఐఏఎస్ మంచి ప్లాట్‌ఫాం అని నాన్న తరుచూ చెప్తుండేవారు. నాన్నకు ప్రేమతో ఐఏఎస్ సాధించాలని లక్ష్యం పెట్టుకొని నేడు సాధించాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సివిల్స్ కోసం ఢిల్లీలోని ప్రముఖ వాజీరాం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా. కానీ అక్కడ ఉండి చదవాల్సిన అవసరం లేదని, ఇంటికి వచ్చేశా. ఇంటర్నెట్లో అవసరమైన పూర్తి మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకొని సబ్జెక్టు నోట్స్ స్వతహాగా తయారు చేసుకున్నా. అందుకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్లను నాన్న ఏర్పాటు చేశారు.
ఒక ఐఏఎస్‌గా మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు?
మహిళలు, విద్యా రంగానికి నేను అధిక ప్రాధాన్యత ఇస్తా.
మీకు స్నేహితులు ఎవరైనా సహకరించారా?
ఇది వరకు ఐఏఎస్‌కు ఎంపికైన నిఖిల్‌తోపాటు అంకిత, దీక్షితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. మేము ఆరుగురం స్నేహితులం. ఈ సారి పరీక్షలు రాస్తే అందులో నాతోపాటు పవన్‌దత్త, జయసింహారెడ్డి, అక్షయ్దీపక్ ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
మీ ఆప్షనల్ సబ్జెక్టు ?
ఆంత్రొపాలజీ ఆప్షన్ ఎంచుకొన్నా. అదే నాకు ప్లస్ అయ్యింది.
నాలుగుసార్లు ఫెయిల్యూర్‌ను ఎలా జయించారు?
నాలుగుసార్లు ప్రయత్నించినా అనుకున్న లక్ష్యం నెరవేరకపోయే సరికి చాలా ఒత్తిడికి గురయ్యా. కానీ అందరిలా దిగులు చెందలేదు. దాన్ని అధిగమించేందుకు యోగా, టెన్నిస్, రన్నింగ్వంటితో పాటు ఇష్టమైన సినిమాలు, సీరియల్స్ చూసేదాన్ని.
3వ ర్యాంక్ వస్తుందని ఉహించారా?
తప్పకుండా ఈ సారి మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉండేది. కానీ ఏకంగా ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. అత్యుత్తమ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

