Governor Tamilisai | గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..
గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్‌రాజన్ (Governor Tamilisai) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
హైదరాబాద్: గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019, సెప్టెంబర్ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గతకొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

