కొన్ని కార్యక్రమాల్లోనే ఆత్మసంతృప్తి: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ | కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు.

హైదరాబాద్: కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్ హాస్పిస్ అన్నారు. క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలియదని చెప్పారు. పాలియేటివ్ కేర్ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరమని వెల్లడించారు.
రోటరీ క్లబ్ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని చెప్పారు. స్పర్శ్ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్‌కు తానొక్కడినే బాధ్యుడిని కాదన్నారు.
అవసాన దశలో చేసే సేవే నిజమైనది..
ప్రపంచంలో అనేక రకాల సేవలు ఉంటాయని, మనిషికి అవసాన దశలో చేసే సేవే నిజమైన సేవ అని శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి అన్నారు. మనిషికి చివరి దశలో ఆత్మీయ స్పర్శ, పలకరింపు కావాలన్నారు. చివరి మజిలీలో సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

