Sridhar Babu | ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడలేకపోతున్నం.. ఎంత ఖర్చు పెడుతున్నా ఫలితం లేదు: మంత్రి దుద్దిళ్ల
ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు.
- ఎంఈవోలు కూడా ఇతర పనుల్లో ఉన్నరు
- అధికారులతో సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Sridhar Babu | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణాతోపాటు ఇతర ఉన్నతాధికారులతో విద్యాసంసరణలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ సూళ్లు ఎందుకో ఇప్పుడా పరిస్థితిలో లేవని వాపోయారు.
‘గుజరాత్ నుంచి ఏటా 30- 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయాలు సింగపూర్ వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు. ఆ తరహా ప్రయత్నం మనవద్ద కూడా జరగాలి. ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకేలోని విద్యాప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశపెట్టాలి. పాఠ్యాంశాలను మార్చాలి’ అని ఆదేశించారు. వచ్చే 2, 3 ఏండ్లలోనే విద్యావిధానంలో సమూల మార్పులు జరగాలని, ఢిల్లీలోని ప్రభుత్వ సూళ్లలో అమలవుతున్న విధానాలను పరిశీలించి ఇక్కడ అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఒకప్పుడు డీఈవోలు తరచూ సూళ్లను తనిఖీ చేసేవారు. ఎంఈవోలు ఇతర పనులు చేస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలను పెంచే ప్రయత్నం చేయడం లేదు. సూళ్లలో వక్తృత్వ పోటీలు జరిగేవి. విద్యార్థులను విజ్ఞానయాత్రలకు తీసుకెళ్లేవారు. ప్రైవేట్ సూళ్లలో ఇవన్నీ ఉన్నయి’ అని చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ ఈ వెంకట నర్సింహారెడ్డి, అదనపు డైరెక్టర్ లింగయ్య, ఓపెన్ సూల్ డైరెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

