మంత్రి పదవిపై ఆశతోనే బీర్ల తిట్ల పురాణం
కాంగ్రెస్ అసమర్థ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రజలకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్‌లో రైతుగర్జన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందని, మంత్రి పదవిపై ఆశతో కేటీఆర్, హరీశ్‌రావుపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్థాయిని మించి మాట్లాడుతున్నారని మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
-
మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదాద్రిభువనగిరి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అసమర్థ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రజలకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్‌లో రైతుగర్జన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందని, మంత్రి పదవిపై ఆశతో కేటీఆర్, హరీశ్‌రావుపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్థాయిని మించి మాట్లాడుతున్నారని మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాజీ విప్ మాట్లాడుతూ .. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి హైదరాబాద్‌లో ప్రెస్మీట్లేంటని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై నిప్పులు చెరిగారు. మూడేండ్ల కాలంలో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, వందరోజుల్లో ఆలేరును రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ 2023-24లో 59,89,000 హెక్టార్లు సాగులోకి తీసుకువచ్చారని చెప్పారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా టీఎస్ ఐపాస్ పథకాన్ని తీసుకువచ్చి రాష్ర్టానికి రూ. 2,67,000 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

