హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కు ఇండిగో విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండిగో విమానం(6E 269) బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్ నుంచి కూడా 6E 102 విమానం బయల్దేరి హైదరాబాద్‌కు సాయంత్రం 4:35 గంటలకు చేరుకోనుంది. హైదరాబాద్ – కాన్పూర్ మధ్య వారానికి ఆరు సార్లు ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న టైర్ 2 పట్టణాలకు విమాన సర్వీసులను విస్తరిస్తామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానికర్ తెలిపారు. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. ప్రయాణికులు కొవిడ్ నివారణ చర్యలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రదీప్ పానికర్ పేర్కొన్నారు.