BRS MP N Nageswara Rao: తక్షణమే రిజర్వేషన్ అమలు చేయండి.. లేదంటే డెడ్‌లైన్ పెట్టండి: ఎంపీ నామా నాగేశ్వరరావు
BRS MP N Nageswara Rao: తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఎంపీ నామా డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లోనే ఆ బిల్లును అమలు చేయాలన్నారు. లేదంటే దానికి ఓ డెడ్‌లైన్ విధించాలని కోరారు. నియోజకవర్గాల పునర్ విభజనతో పాటు రిజర్వేషన్ అమలు విషయంలో డెడ్‌లైన్ ఉండాలని బీఆర్ఎస్ ఎంపీ సూచించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇప్పటి వరకు అయిదు సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు( BRS MP N Nageswara Rao) తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. గతంలో దేవగౌడ, వాజ్‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో, 13వ లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, 15వ రాజ్యసభలో ఆ బిల్లు పాసైందని, ఇప్పుడు అయిదోసారి లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని, ఇది మా పార్టీ విధాన నిర్ణయమన్నారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 12 రోజుల్లోనే లెజిస్టేటివ్ అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పించేందుకు తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సర్పంచ్, జెడ్సీసీ, ఎంపీటీసీల్లో.. మహిళలకు తమ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తోందన్నారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల్లోనూ తెలంగాణ సర్కార్ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినట్లు నామా తెలిపారు.
తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఎంపీ నామా డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లోనే ఆ బిల్లును అమలు చేయాలన్నారు. లేదంటే దానికి ఓ డెడ్‌లైన్ విధించాలని కోరారు. నియోజకవర్గాల పునర్ విభజనతో పాటు రిజర్వేషన్ అమలు విషయంలో డెడ్‌లైన్ ఉండాలని బీఆర్ఎస్ ఎంపీ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

