హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): జీనోమ్ వ్యాలీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు సీసీఎంబీ మాజీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణియన్ ఎంపికయ్యారు. బయోఏషియా సదస్సు నేపథ్యంలో గురువారం జీనోమ్ వ్యాలీలో ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్ (ఎఫ్ఏబీఏ) కర్టెన్‌రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలసుబ్రహ్మణియన్కు అవార్డు అందజేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర బయోటెక్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.