G-20 Summit | నేటి నుంచి హైదరాబాద్‌లో జీ-20 సదస్సు.. నాలుగు రోజులు సమావేశాలు
జీ-20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో ‘డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్' (డీఈడబ్ల్యూజీ) సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలేశ్ కుమార్ శర్మ, టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్ పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): జీ-20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో ‘డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్’ (డీఈడబ్ల్యూజీ) సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలేశ్ కుమార్ శర్మ, టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణపై ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. డిజిటల్ ఎకానమీని మరింత విస్తృతం చేయడంతోపాటు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరుచడంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు చెప్పారు. ఈ విషయాలపై సభ్యదేశాల అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖల సహాయ మంత్రి నారాయణ స్వామి పాల్గొంటారని చెప్పారు. నాలుగు రోజుల చర్చలో కొత్తగా వస్తున్న డిజిటల్, టెలికాం టెక్నాలజీలు, సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మిళిత వృద్ధి సాధించడంపై అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలు పంచుకోనున్నట్టు పేర్కొన్నారు. జీ-20 ప్రతినిధులు హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఐఐటీ)ని సందర్శిస్తారని చెప్పారు. 18న వర్‌షాప్ జరుగుతుందని అన్నారు. జీ-20లో తొలిసారిగా ఈ ఏడాది ‘డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్’ కార్యక్రమం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఇందులో పోటీపడవచ్చని వివరించారు. ఇప్పటివరకు 1600కు పైగా స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకున్నాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

