Public Voice | దొందూ దొందే!.. కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డిపై ఓటర్ల ఒపీనియన్ ఇదీ!
Public Voice | అవును మీరు మీరు ఒకటే. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకొని పార్టీ మారిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, కోట్లు తీసుకొని సీట్లు ఇస్తున్న రేవంత్‌రెడ్డి ఒక్కటేనని ప్రజలూ అనుకుంటున్నరు.
Public Voice | ఓటరు: పార్టీ ఎందుకు మారారు?
రాజగోపాల్‌రెడ్డి: కేసీఆర్‌ను గద్దె దించడానికి. కాంగ్రెస్ వల్లే అది సాధ్యం.
ఓటరు:అప్పట్లో బీజేపీలో చేరేటప్పుడు బీజేపీ వల్లే సాధ్యం అన్నట్టున్నారు.
రాజగోపాల్‌రెడ్డి: తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పడిపోయింది.
ఓటరు:ఇప్పుడు మీరు కాంగ్రెస్‌ను పడగొడుతారా? అయినా మీరు చేరాకే కమలం వాడిపోయినట్టుంది.
రాజగోపాల్‌రెడ్డి: ఆ.. అది!
ఓటరు:బీజేపీని ఎందుకు వీడినట్టో?
రాజగోపాల్‌రెడ్డి: అవినీతిపై చర్యలు తీసుకోలే. అందుకే.
ఓటరు: ఎవరి అవినీతిపై? ఓటుకు నోటు రేవంత్‌పైనా? బీజేపీలో చేరేటప్పుడు మీరు తీసుకున్నారే.. 18 వేల కోట్ల కాంట్రాక్టు. దానిపైనా? లేదా ఈమధ్య రేవంత్ పుచ్చుకుంటున్న నోటుకు సీటుపైనా?
రాజగోపాల్‌రెడ్డి: ఆ.. అది.. అది!
ఓటరు:అప్పట్లో మీరు, రేవంత్ పొట్టుపొట్టు తిట్టుకున్నరు కదా?
రాజగోపాల్‌రెడ్డి: నేనూ రేవంత్ ఏమైనా పాలోళ్లమా? పగోళ్లమా? మాకు గట్టు పంచాయితీలు ఉన్నయా? అయినా ఈరోజు పీసీసీ పదవిలో రేవంత్ ఉన్నడు. రేపు ఇంకొకళ్లు ఉంటరు.
ఓటరు: రేవంత్‌ను దించేస్తానని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నారా? కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నడని విమర్శించారు. ఇంతకీ మునుగోడు సీటు కోసం మీరెంత ఇచ్చారు?
రాజగోపాల్‌రెడ్డి: అటువంటిదేం లేదు. మేం మేం ఒకటే.
ఓటరు: అవును మీరు మీరు ఒకటే. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకొని పార్టీ మారిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, కోట్లు తీసుకొని సీట్లు ఇస్తున్న రేవంత్‌రెడ్డి ఒక్కటేనని ప్రజలూ అనుకుంటున్నరు.
-మాలోతు సురేష్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

