హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సంస్థ నోడల్ ట్రైయినింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ వ్యవసాయ విస్తరణాభివృద్ధి సంస్థ (మేనేజ్) సహకారంతో అగ్రి క్లినిక్, అగ్రి వ్యాపారంపై 45 రోజులపాటు హైదరాబాద్ కూకట్పల్లిలోని సీఈడీలో ఉచితంగా ఇచ్చి సరిఫికెట్లు అందిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు వ్యవసాయ అనుబంధ డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఎస్సీ (బీజెడ్సీ) కోర్సులను పూర్తి చేసి, తెలంగాణకు చెందిన వారై ఉండాలని సూచించారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. వివరాలకు 703666421/422/424 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. తుది గడువు ఈ నెల 14 వరకు ఉందని తెలిపారు.