e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత

రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత

రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతన్నలకు, హమాలీలకు ఉచిత అన్నదాన ‌కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజమాబాద్ జిల్లా మార్కెట్ యార్డులో హమాలీ యూనియన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో అన్నదానం కొనసాగుతున్న విధంగానే మార్కెట్ యార్డులో సైతం ప్రారంభిస్తామన్నారు.


మార్కెట్ యార్డులో ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రదేశాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండే హమాలీ కార్మికులను అన్నివిధాలుగా ఆదుకుంటామని కవిత అన్నారు. టీఆర్ఎస్ కార్మికుల పక్షపాతి అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.

రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
- Advertisement -


త్వరలో సొంత నిధులతో రైతులకు, హమాలీలకు మార్కెట్ యార్డులో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన ఎమ్మెల్సీకి రైతులు, హమాలీలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

సీఎం కేసీఆర్‌ చిత్రపట్టానికి పాలాభిషేకం

పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

టీఆర్‌ఎస్‌లోకి 50 మంది బీజేపీ నాయకులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత

ట్రెండింగ్‌

Advertisement