భువనగిరి కలెక్టరేట్;కాంగ్రెస్‌లోని అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎదురుగానే ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వర్గీయులు తోపులాటకు దిగారు. భువనగిరి మండలం రాయగిరిలో శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ కుడుదుల నగేశ్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య పరస్పరం దూషించుకొన్నారు. మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే తోపులాటకు దిగడంతో పార్టీ కార్యకర్తలు అసహనానికి గురయ్యారు.