Medak | మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మహిళలు, బాలుడు మృతి
Medak | జిల్లాలోని మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో విషాదం నెలకొంది. ముగ్గురు మహిళలు, ఒక బాలుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.
Medak | మెదక్ : జిల్లాలోని మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో విషాదం నెలకొంది. ముగ్గురు మహిళలు, ఒక బాలుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. వర్గల్ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన దొడ్డు బాలమణి(30), ఆమె కుమారుడు చరణ్(10).. రంగాయపల్లిలో బోనాల పండుగకు హాజరయ్యారు. అయితే సోమవారం మధ్యాహ్నం తమ బంధువులైన దొడ్డు లక్ష్మి(25), పిరంగి లావణ్య(25), బాలమణి, చరణ్ కలిసి చెరువులో స్నానాలకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బాలుడు నీట మునిగిపోవడంతో అప్రమత్తమైన తల్లి బాలమణి, అతన్ని కాపాడేందుకు యత్నించగా, ఆమె కూడా నీట మునిగింది. దీంతో మిగతా ఇద్దరు మహిళలు కూడా వారిద్దరిని కాపాడేందుకు యత్నించగా, నీట మునిగారు. దీంతో ముగ్గురు మహిళలు, బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను చెరువులో నుంచి బయటకు వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

