టీకాలు 4 కోట్లు

- రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,970 వాక్సినేషన్ బృందాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలో 3,500 కేంద్రాల్లో, ప్రైవేట్‌లో 264 కేంద్రాల్లో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. మొత్తం 35 వేల మంది సిబ్బంది వ్యాక్సినేషన్లో పాలుపంచుకొంటున్నారు. ఇందులో 10 వేల మంది వ్యాక్సినేటర్లు ఉన్నారు. ఇప్పటివరకు వేసిన 4 కోట్ల టీకాల్లో ప్రభుత్వ కేంద్రాల నుంచి 87 శాతం పంపిణీ చేయగా, 13 శాతం ప్రైవేట్ కేంద్రాల్లో వేశారు. కాగా, టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యాచరణ అమలు చేస్తున్నది. అర్హులను 44 క్యాటగిరీలు విభజించి టీకాలు వేస్తూ వస్తున్నది. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి టీకా వేస్తున్నది. ప్రయాణ ప్రాంగణాలు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి టీకాలు వేస్తున్నది.
నెలాఖరులోగా వందశాతం
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెలాఖరులోగా కనీసం ఒక డోస్ వేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. దీంతో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తున్నది. గురువారం నాటికి 2,62,11,799 మందికి మొదటి డోస్ వేశారు. 94.3 శాతం మందికి పూర్తి చేశారు. మరో 15.55 లక్షల మందికి టీకా వేయాల్సి ఉన్నది. 1.40 కోట్ల మందికి రెండో డోస్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 58 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేస్తామని వైద్యసిబ్బంది చెప్తున్నారు.
టీకా వేసుకోండి.. సురక్షితంగా ఉండండి
తెలంగాణ 4 కోట్ల కొవిడ్ టీకాల మైలురాయిని దాటడం సంతోషంగా ఉన్నది. కరోనా వైరస్‌ను ఓడించేందుకు మేము సైతం అంటూ టీకా వేసుకొన్న ప్రతి పౌరుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలి. మీతోపాటు మిమ్మల్ని అమితంగా ప్రేమించేవారికి వెంటనే రెండు డోసు ల టీకాలు వేసి రక్షణ కల్పించండి.
–మంత్రి హరీశ్‌రావు
- అహోరాత్రులు శ్రమిస్తున్న
- 7,970 వాక్సినేషన్ బృందాలు
- 94% మందికి ఫస్ట్ డోస్..
- 50% మందికి రెండో డోస్ పూర్తి
- ఈ నెలాఖరుకు మొదటి డోస్
- 100% పూర్తి దిశగా కార్యాచరణ
- రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2,77,67,000
- వేయాల్సిన మొత్తం డోసులు 5,55,34,000
- ఇప్పటి వరకు వేసినవి4,02,79,015
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

