రుణమాఫీ కంటే డంబాచారానికి ఎక్కువ ఖర్చు
రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డంబాచారాలకే ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు.
- అదొక మిస్టరీలా మారింది
- మేడిగడ్డ నీటిని విడుదల చేయాలి
- ఈసారి కూడా పొలాలు ఎండబెడితే సహించం
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, జూలై 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డంబాచారాలకే ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షలోపు రుణమాఫీ 20% మందికి కూడా పూర్తికాలేదని దుయ్యబట్టారు.
బటన్ నొక్కితే కాళేశ్వరం జలాలు వస్తాయి
వ్యవసాయం, సాగునీటిపై సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సర్కారులో ఎవరికీ అవగాహన లేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గత యాసంగిలో మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోతుందంటూ విషప్రచారం చేసి రైతులకు అన్యా యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పు డు మేడిగడ్డ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నా ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉన్నదని, అయినా ఒక్క బటన్ నొక్కి వ్యవసాయానికి నీటిని వదలాలనే ఆలోచన చేయడం లేదని పేర్కొన్నారు. ఇది రైతులను నట్టేట ముంచే కుట్రగా కనిపిస్తున్నదని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.యాసంగి మాదిరిగా ఈసారి కూడా వ్యవసాయాన్ని ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గోదావరి జలాలను వృధాగా పోనీయకుండా కాళేశ్వరం వద్ద మోటర్ల బటన్ నొక్కి నీటిని పంపింగ్ చేసి తక్షణమే సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

