అబద్ధాలతో నిజాలను దాచలేరు
‘ముఖ్యమంత్రి గారూ! ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతాలు ఇస్త్తున్నామనే మీ సిబ్బంది పత్రికా ప్రకటన నిజమా? లేక మూడు నెలలుగా జీతాల కోసం మౌనంగా రోదిస్తున్న పేద ఉద్యోగుల కంటినీరు నిజమా?’ అని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
- ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతాలు రావడం లేదనేది పచ్చి నిజం
- పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి గారూ! ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతాలు ఇస్త్తున్నామనే మీ సిబ్బంది పత్రికా ప్రకటన నిజమా? లేక మూడు నెలలుగా జీతాల కోసం మౌనంగా రోదిస్తున్న పేద ఉద్యోగుల కంటినీరు నిజమా?’ అని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా హరీశ్‌రావు ప్రజా సమస్యలు, ఉద్యోగుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పరిషరించాల్సిందిపోయి, ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
సోమవారం ఆయన పేట్లబురుజు దవాఖానను సందర్శించి అకడ పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ డాటా ఎంట్రీ సిబ్బందిని కలిశారు. పేట్లబురుజు ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్యశ్రీ డాటా ఎంట్రీ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదనేది పచ్చి నిజమని, అబద్ధపు పత్రికా ప్రకటనలు విడుదల చేసినంత మాత్రాన నిజాలు మారవని మండిపడ్డారు. జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏకంగా 18 నెలలుగా జీతాలు అందడం లేదని సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలపై హరీశ్‌రావు చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రభుత్వం ప్రకటన ఇప్పించిందని తప్పుబట్టారు. ప్రభుత్వం చిల్లర రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలు పకనబెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు చెప్పారు. కడుపుకాలిన ఉద్యోగులు రోడ్డెకి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సిబ్బందికి రావాల్సిన పెండింగ్ వేతనాలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

