TB | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): క్షయ (టీబీ)తోపాటు ప్రపంచాన్ని కలవరపెడుతున్న వివిధ రకాల కొత్త వ్యాధుల నియంత్రణ కోసం హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ మోడ్రన్ బయాలజీపై దృష్టి సారించింది. డాక్టర్ సంగీత ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని సీడీఎఫ్‌డీ బృందం ఇమ్యూనాలజీ, డ్రగ్ డిస్కవరీ, ఇన్ఫెక్షన్ బయాలజీపై పరిశోధనలు సాగిస్తున్నది.
క్షయ వ్యాధి నిర్మూలనతోపాటు వివిధ వ్యాధులకు చెక్‌పెట్టే మందుల తయారీలో ఈ పరిశోధనలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయని సీడీఎఫ్‌డీ వర్గాలు చెప్తున్నాయి.