హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయెట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పరీక్ష రేపు(ఆదివారం) జరుగనున్నది.
ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్సీఈఎంఎస్) తెలిపింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.