ఒక్కసారి చెబితే..వందసార్లు చెప్పినట్టే
నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’.. భాషా సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఫోన్లలో స్టేటస్ రూపంలో దర్శనమిస్తోంది.
- జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీ
- నిమిషాల వ్యవధిలోనే తొలగింపు
జగిత్యాల, మార్చి 22(నమస్తే తెలంగాణ): ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’.. భాషా సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఫోన్లలో స్టేటస్ రూపంలో దర్శనమిస్తోంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పార్టీకి రాజీనామా చేస్తానని ఆ పార్టీ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రులను రాయబారానికి పంపించించగా ఆయన వినలేదు. కాంగ్రెస్‌కు ఈ నెల 25న రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొందరు కార్యకర్తలు, రజినీకాంత్ ఫొటో, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఫొటోతో ఫ్లెక్సీనీ ఏర్పాటుచేశారు. బాషా సినిమాలో రజినీకాంత్ డైలాగ్ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అనే అర్థం వచ్చేలా ‘ఇఫ్ ఐ సే వన్ టైమ్, ఇట్ ఈజ్ ఈక్వెల్ టు 100 టైమ్స్’ అంటూ ఆంగ్లంలో పేర్కొన్నారు. తెలంగాణ పొలిటికల్ సూపర్‌స్టార్ జీవన్‌రెడ్డి అని పేర్కొన్నారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్‌రెడ్డి అభిమానులు తమ సెల్‌ఫోన్ స్టేటస్‌గా పెట్టుకోవడం కనిపించింది. ఈ ఫ్లెక్సీని చూసిన జీవన్‌రెడ్డి దాన్ని తొలగించాలని కార్యకర్తలకు సూచించడంతో నిమిషాల వ్యవధిలోనే తీసేశారు. ఈ ఫ్లెక్సీ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

