Road Accident | చేగుంటలో రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సహా ఐదురుగురు దుర్మరణం
మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ డ్రైవర్‌తోపాటు క్యాబిన్లో కూర్చున్న ఐదుగురు మరణించారు.
మెదక్: మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ డ్రైవర్‌తోపాటు క్యాబిన్లో కూర్చున్న ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదికూడా చదవండి..
ఒకే ట్రిప్‌లో 130 మంది ప్రయాణం
కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతన్నారు. మహాలక్ష్మీ స్కీం తెచ్చి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ట్రిప్పులు తగ్గించి విద్యార్థులను ఇక్కట్ల పాలు చేస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి శివారులోని మాడల్ స్కూల్లో సుమారు 750 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాకా రెండు ట్రిప్పులు నడిచిన బస్సును.. ఇప్పుడు ఒక ట్రిప్పు తగ్గించడంతో ఒకే ట్రిప్పులో సుమారు 130 మంది దాకా స్కూల్‌కు వెళ్తున్నారు. బస్సు కిక్కిరిసిపోవడంతో ఊపిరి కూడా ఆడటం లేదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికెళ్లి హోంవర్క్ కూడా పూర్తిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు, ట్రిప్పుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

