Crocodile attack | మొసలిదాడిలో జాలరికి తీవ్రగాయాలు.. పాకాల సరస్సులో ఘటన
Crocodile attack | మొసలిదాడిలో( Crocodile attack) జాలరికి తీవ్ర గాయాలైన(Fisherman injured) ఘటన వరంగల్(warangak) జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో(Pakala lake) జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..
వరంగల్ : మొసలిదాడిలో( Crocodile attack) జాలరికి తీవ్ర గాయాలైన(Fisherman injured) ఘటన వరంగల్(warangak) జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో(Pakala lake) జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బుధరావుపేట గ్రామానికి చెందిన షాట్ల చంద్రమౌళి వృత్తిరీత్యా జాలరి. కొత్తగూడ మండల పరిధిలోని గుండం సమీపం నుంచి పాకాల సరస్సులోకి తెప్పపై చేపలవేటకు వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక మొసలి ఆకస్మాత్తుగా దాడి చేయడంతో కాలు, తొడ పైభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి.
దీంతో అతడు బిగ్గరగా కేకలు వేయడంతో మొసలి వదిలేసింది. అదేసమయంలో అతడికి సమీపంలో చెరువులో చేపలవేటకు వచ్చిన మరికొందరు జాలర్లు గమనించి అతడి వద్దకు వెళ్లి ఒడ్డుకు చేర్చారు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో 108 వాహనంలో నర్సంపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం దవాఖాన, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

