Vemulawada | వేములవాడ జాతర గ్రౌండ్లో అగ్నిప్రమాదం.. దట్టంగా కమ్ముకున్న పొగలు
వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. జాతర గ్రౌండ్ ఏరియాలో ఉన్న ఆలయానికి చెందిన రెండు లీజు గదుల్లో నిల్వచేసిన కొబ్బరి (Coconut) చిప్పలకు మంటలు అంటుకున్నాయి.
వేములవాడ: వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలోని జాతర గ్రౌండ్లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. జాతర గ్రౌండ్ ఏరియాలో ఉన్న ఆలయానికి చెందిన రెండు లీజు గదుల్లో నిల్వచేసిన కొబ్బరి (Coconut) చిప్పలకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆరబెట్టిన కొబ్బరి చిప్పలు కావడంతో మంటలు వేగంగా విస్తరించడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొంగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ఆస్తి నష్టం మాత్రం సంభవించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

