డ్రగ్స్ అమ్మి.. సినిమాల్లో పెట్టుబడి
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ టీఎస్-నాబ్‌కు చిక్కిన సినీ నిర్మాత, ఫైనాన్సియర్ వెంకట్ అలియాస్ వెంకటరత్నారెడ్డి లీలలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి.
- డ్రగ్స్ నిందితుడు వెంకట్ లీలలు వెలుగులోకి..
- గతంలో డ్రగ్స్, వ్యభిచారం, మోసం కేసుల్లో అరెస్ట్
- రెండు తెలుగు రాష్ర్టాల్లో 20కి పైగా కేసులు
- వెంకట్‌తో టచ్‌లో ఉన్నవారి వివరాలపై పొలీసుల ఆరా
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ టీఎస్-నాబ్‌కు చిక్కిన సినీ నిర్మాత, ఫైనాన్సియర్ వెంకట్ అలియాస్ వెంకటరత్నారెడ్డి లీలలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అతనిపై రెండు తెలుగు రాష్ర్టాల్లో వివిధ నేరాలపై 20కిపైగా కేసులున్నట్టు వెల్లడయ్యింది. చీటింగ్ సొమ్ముతో అతను సినిమాల్లో, ఫైనాన్స్ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్టు తేలింది. డ్రగ్స్ విక్రయం కేసులో టీఎస్-నాబ్ పోలీసులు వెంకట్ బాలాజీతోపాటు కస్టమర్ మురళిని అరెస్ట్ చేశారు. గుడిమల్కాపూర్ పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. వెంకట్ గురించి ఆరా తీస్తుంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మాదాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్టుమెంట్లో వెంకట్ డ్రగ్స్ పార్టీ నిర్వహించే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వెంకట్ ఘరానా మోసాల చిట్టా
- 2019లో ఒక బోటిక్ నిర్వాహకులకు తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం చేయిస్తానని ఒప్పందం చేసుకొని ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తాడు. తనతో పాటు మరో 9 మందికి బ్రేక్ దర్శనం కావాలని ఓ ఐడీ కార్డుతో టీటీడీకి దరఖాస్తు చేశాడు. విజిలెన్స్ అధికారులు నకిలీ ఐడీ అని తేల్చడంతో తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు.
- ఇతర రాష్ర్టాలు, విదేశీ మద్యం అక్రమ వ్యాపారం చేస్తుండేవాడు. గుంటూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నెహ్రూనగర్‌లోని వెంకట్ ఇంట్లో సోదాలు చేసి 121 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేశారు.
- బంజారాహిల్స్, గోల్కొండ, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, చార్మినార్ తదితర ఠాణాల పరిధిలో మోసం, దొంగతనం, వ్యభిచార గృహాల నిర్వహణ తదితర నేరాలతోపాటు పోక్సో కేసులూ ఉన్నాయి.
2011 నుంచే నేరాలు
వెంకట్‌పై 2011 నుంచి కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. సినీ పరిశ్రమ వారితో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తుండేవాడు. వివిధ రకాల డ్రగ్స్ తీసుకొచ్చే బాధ్యతను బాలాజీకి అప్పగించాడు. ఈ ఇద్దరూ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు, వీళ్ల నెట్వర్క్ ఏంటి అన్న విషయాలపై టీఎస్-నాబ్ ఆరా తీస్తున్నది. నిందితుడిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించి, మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టనున్నారు. సినిమాల్లో సుమారు ఐదు కోట్లకు పైగా ఫైనాన్స్ చేశాడని వెల్లడైంది.
ఆ 18 మందీ నిందితులే..
వెంకట్‌తో టచ్‌లో ఉన్న 18 మంది డ్రగ్ వినియోగదారుల జాబితాను టీఎస్-నాబ్ సేకరించింది. ఫోన్లలో కోడ్ భాషలో వారి పేర్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఆ పేర్లను సేకరించారు. వారందరినీ నిందితుల జాబితాలో చేర్చారు. వారిలో రాంచంద్, అర్జున్, రవి ఉప్పలపాటి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కలహార్‌రెడ్డి, సురేశ్, రాంకుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తీక్, నర్సింగ్, ఇటాచీ, మహ్మద్ అజీమ్, అమ్జద్తోపాటు మరికొందరు ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరంతా పరారీలో ఉన్నారు. వీరితోపాటు వెంకట్, బాలాజీకి బెంగళూర్‌లో డ్రగ్ సరఫరా చేస్తున్న వైజాగ్‌కు చెందిన రామ్, నైజీరియన్లు ఆమోదీ చుకువుడి ముమాంగోల్, ఇగ్బార్ మైఖేల్, థామస్ అంఘా కలులనూ నిందితుల జాబితాలో చేర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

