Navdeep | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 19 వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారని, డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో తనను కూడా అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతని న్యాయవాది కోరారు. వాదనల అనంతరం మంగళవారం వరకు పిటిషనర్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.