Job Notification | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని హోమ్శాఖలో సుమారు 7,437 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హోమ్శాఖలోని కీలక విభాగాలైన పోలీసు, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్లో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు.
