వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
- సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు రియల్ హీరోలు
- నటి జీవితపై ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): సినిమాలో స్రిప్ట్ చదివినట్టు, రాజకీయ ఉపన్యాసాలు కూడా చదివే ముందు వాస్తవా లు తెలుసుకొని మాట్లాడాలని సినీనటి జీవిత రాజశేఖర్‌కు ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం సూచించారు. పూటకో పార్టీ మార్చే నటి జీవిత, కేసీఆర్ కుటుంబసభ్యులపై చేస్తున్న విమర్శలను గురువారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ఎమ్మెల్సీ కవిత తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబసభ్యులు హీరోలు కాబట్టే నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్ర ఏర్పాటుకోసం అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. మీరు జీరోలు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వారితో జతకట్టి, కనీసం ఒక ప్రజాసమస్యపైనైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు? బీజేపీ నాయకుల మెప్పుకోసం పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

