ఆదిలాబాద్ : రాష్ట్రంలో కరెంట్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ మండలం అర్లి టీ గ్రామంలో సబ్ స్టేషన్ ముందు గోముత్రి గ్రామ రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని అందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇష్టారీతిగా విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటున్నా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Indraja | నిర్మాతని కంటతడి పెట్టించిన ఇంద్రజ.. జయసుధ తర్వాత ఆమే నాకు ఇష్టమైన హీరోయిన్..
Gujarat Crime | గుజరాత్లో ఘోరం.. శుద్ధీకరణ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్