ట్రిపుల్ఆర్ మాకొద్దు!
రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు నిర్ణయించిన మరుసటి రోజు నుంచి రైతులు ఉద్యమిస్తున్నారు.
- సాగు భూములిచ్చేది లేదు
- పట్టాభూముల జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటాం
- కలెక్టరేట్ ఎదుట బాధిత రైతుల ధర్నా
వికారాబాద్, నవంబర్ 23, (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు నిర్ణయించిన మరుసటి రోజు నుంచి రైతులు ఉద్యమిస్తున్నారు. సోమవారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ఆధ్వర్యంలో పూడూరు, వికారాబాద్, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్ మండలాల రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణాలైనా ఇస్తాం కానీ.. భూములివ్వమని స్పష్టంచేశారు. పాత అలైన్మెంట్ ప్రకారం రీజినల్ రింగ్‌రోడ్డును చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటే కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

