నకిలీ పత్తి విత్తనాలు సీజ్
సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల కేసులో ముగ్గురు నిందితులను పట్టుకోగా నలుగురు పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం వెల్లడించారు.
- ముగ్గురు నిందితుల అరెస్ట్.. పరారీలో నలుగురు
సూర్యాపేట సిటీ, జూన్ 5/ఫర్టిలైజర్ సిటీ: సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల కేసులో ముగ్గురు నిందితులను పట్టుకోగా నలుగురు పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం వెల్లడించారు. తిరుమలగిరి మండలంలోని ఈదులపర్రె తండాకు చెందిన సంకేపల్లి సోమిరెడ్డి, గుగులోతు ప్రేమ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలో భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిన్నారని, గుంటూరు జిల్లాకు చెందిన నాగమల్లేశ్వర్రావు నుంచి తిరుమలగిరికి చెందిన అనంతరెడ్డి నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి నిందితులు సోమిరెడ్డి, ప్రేమ్‌కుమార్‌కు అమ్మగా.. వారు వాటిని రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు.
రైతులను నమ్మించి అమ్ముతూ మోసగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిందితుల ఇండ్లల్లో దాడులు చేశారు. దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలతోపాటు నిషేధిత 300 లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అర్వపల్లి మండ లం కోటూరుకు చెందిన పేర్ల వెంకన్న ఇంట్లో దాడులు చేసి రూ.66 వేల విలువైన 22 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని వెంకన్నను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులైన మరో నలుగురు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపా రు. మంచిర్యాల జిల్లా నీల్వాయి మండలం వేమనపల్లిలో పోలీసులు రూ.6.75 లక్షల విలువైన 2.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నట్టు రామగుండం సీపీఎం శ్రీనివాస్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

